పశువుల ఆసుపత్రి కట్టి మూడేళ్లు అవుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
_జోడోయాత్రలో కాంగ్రెస్ నేత డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ విమర్శలు
జనగామ ప్రతినిధి (జనంసాక్షి)సెప్టెంబర్15 :స్థానిక ప్రజా సమస్యలు లేవనెత్తడమే ఇతివృత్తంగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా టి.పి.సి.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వైద్య విభాగం) డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ చేపట్టిన జోడో పాదయాత్ర ప్రతి పల్లెలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో మాట్లాడిన డాక్టర్ కృష్ణ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు. పశువుల ఆసుపత్రి నిర్మించి మూడేళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి పట్టింపు లేదా అని ప్రశ్నించారు. అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ రాజ్యం రావాలని చెప్పారు. పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, గతంలో రైతులకు ఉచిత విద్యుత్, ఉపాధి హామీ పథకం, 108 అంబులెన్స్ సర్వీసులు, రైతులకు సబ్సిడీపై ఎరువులు విత్తనాలు అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. పేదలకు భూ పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, నేడు బీఆర్ఎస్ హయాంలో గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఆరు రిజర్వాయర్లు కట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్ దే అన్నారు. మాయ మాటల సర్కారును గద్దె దింపాలంటే కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. సెప్టెంబర్ 17న జరిగే సోనియా గాంధీ గారి తుక్కుగూడ సభకు భారీగా తరలి వెళ్లి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇప్పగూడ గ్రామ మాజీ సర్పంచ్ మరియు మండల పార్టీ మాజీ అధ్యక్షులు కత్తుల కట్టయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓబీసీ సెల్ మాజీ అధ్యక్షులు అయ్యప్ప శ్రీను, ఇప్పగూడ హై స్కూల్ మాజీ చైర్మన్ కత్తుల మల్లయ్య, గ్రామ సీనియర్ నాయకులు కత్తుల రాజయ్య, బంగారి పరుశురాములు, దాసరి రాజు, న్యాయం సంపత్ రెడ్డి, ములుగురి కిషన్, అక్క పెళ్లి గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు మేడుదల భూపాల్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బేతి జయపాల్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి సదయ్య గౌడ్, ధర్మసాగర్ మండల సీనియర్ నాయకులు అప్పాని సంపత్, ముప్పారం గ్రామ సీనియర్ నాయకులు కొరివి సతీష్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.