లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు

మల్లాపూర్ సెప్టెంబర్15 ( జనం సాక్షి)
మల్లాపూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంజనీర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కనుక సంజీవ్ మాట్లాడుతూ సమాజ నవనిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, మండలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పనిచేస్తున్న ఇరిగేషన్ శాఖ ఏఈ రాకేష్, విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ సంతోష్ లను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం వేడుకల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓటర్ హక్కు అవగాహన కరపత్రాలను గ్రామస్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ రీజియన్ కార్యదర్శి రుద్ర రాంప్రసాద్ సభ్యులు మార్గం రాజేశ్వర్ క్యాతం సురేష్ రెడ్డి కళ్లెం శ్రీనివాస్ రెడ్డి తిప్పర్తి రామ్ కిషన్ మోర సతీష్, మెడికల్ రాజేందర్ పుప్పాల మహేష్ బెజ్జారపు ధనుష్ దామెర శేఖర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు