వినాయక ఉత్సవాలకు పర్మిషన్ తీసుకోవాలి:కొత్తగూడ ఎస్ ఐ నగేష్

కొత్తగూడ సెప్టెంబర్ 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ నగేష్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు,వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలు ప్రతిష్టించాలంటే వారు తప్పనిసరిగా విగ్రహం పెట్టే స్థలం యొక్క యజమాని తో పర్మిషన్ పొంది,కరెంటు శాఖ పర్మిషన్ అదేవిధంగా పోలీస్ శాఖ పర్మిషన్ కూడా పొందవలసి ఉంటుందని అన్నారు.
వినాయక ఉత్సవ కమిటీ జత చేయవలసిన వివరాలు:
1.ప్రదేశము
2.విగ్రహం యొక్క ఎత్తు
3.నిమజ్జనం చేసే తేదీ
4.సభ్యుల యొక్క పేర్లు ఫోన్ నెంబర్లు.
https://policeportal.tspolice.gov.in ద్వారా సమాచారం తో కొత్తగూడ పోలీస్ స్టేషన్ వచ్చి సంప్రదించవలసినదిగా కోరారు.

తాజావార్తలు