ఘనంగా ఎడ్ల(బసవన్నల) కు ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతన్నలు
నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమంముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 14
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గురువారం రోజు పొలాల అమావాస్య సందర్భంగా భైంసా పట్టణములో రోకడ్ హనుమాన్ మందిర్ దగ్గర నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు బసవన్నలకు హారతులిచ్చి స్వాగతం పలికారు ఎడ్ల పొలాల అమావాస్య వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఏ ఎస్పీ కాంతిలా పాటిల్ పట్టణ సీఐ ఎల్ శ్రీను మరియు బిజెపి కార్యవర్గ సభ్యులు రామారావు పటేల్ గాలి రవి మాజీ మున్సిపల్ చైర్మన్ బాజన్నోల్ల గంగాధర్ బసవన్నలకు హారతులు ఇచ్చి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సనాతన ధర్మంలో, భూమి నుంచి మొదలుకొని ఆకాశం వరకు ప్రతి జీవికి పూజించే సంస్కారం, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడనే భక్తితో కొలిచే సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్విస్తూ.. ఇలాగే మనమంతా కూడా మన పండగలను, ఐక్యమత్యంతో జరుపుకుంటూ దేశం కోసం, ధర్మం కోసం, గోవుల రక్షణ కోసం మనమందరం కూడా ముందు ఉండాలని తెలుపుతూ…ప్రజలందరికీ ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు కాండ్లీ సాయినాథ్ ఉపాధ్యక్షుడు విట్టల్ యువజన సంఘం సభ్యులకు ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ మరియు తోటరాము డాక్టర్ దామోదర్ డాక్టర్ అనిల్ డాక్టర్ ముత్యంరెడ్డి చింతపండు మహేష్ తదితరులు పాల్గొన్నారు