కేసిఆర్ పాలన సంక్షేమం లో స్వర్ణయుగం …
రాష్ట్రంలో మళ్లీ అధికారం బీఆర్ఎస్ దే …కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి ….ధర్మపురి నియోజకవర్గ వికలాంగుల ప్రతినిధుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె. వాసుదేవ రెడ్డి…ధర్మపురి (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రంలో సంక్షేమంలో స్వర్ణయుగం తెచ్చారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కె.వాసుదేవ రెడ్డి అన్నారు.
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ వికలాంగుల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక దేశంలో ఎక్కడలేని విధంగా మొదటిసారి ప్రభుత్వంలో రూ.500 నుండి రూ.1500 రెండోసారి ప్రభుత్వంలో రూ.1500 నుండి రూ.3 వేలు మళ్ళీ ఇప్పుడు అదనంగా రూ.1 వెయ్యి పెంచి దేశంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులకు రూ.4016 పెన్షన్ ను అందజేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కొనియాడారు. గతంలో వికలాంగులకు ఏ పరికరాలు అందించాలన్న కేవలం 30% సబ్సిడీతో మాత్రమే అందేవని కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగులకు ఏ పరికరం ఉండాలన్న అది 100% సబ్సిడీతో మాత్రమే అందించాలన్న వారి దృఢ సంకల్పంతో వికలాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు వికలాంగుల కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నామని గుర్తు చేశారు.తెలంగాణ రాష్టం ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ఇప్పటివరకు వికలాంగుల సంక్షేమానికి దాదాపు రూ.10 వేల కోట్ల కు పైగా నిధులు కేటాయించారని రాబోయో రోజుల్లో ఆ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.2016 వికలాంగుల చట్టం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, 2016 వికలాంగుల చట్టాన్ని అనుసరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులు రావడానికి వీలుగా ర్యాంపులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, ఎవరైనా వికలాంగులను దూషించిన కించపరిచినా వారిని 2016 వికలాంగుల చట్టం ప్రకారం శిక్షించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి ని , రాష్ట్ర డీజీపీ ని కోరామని వివరించారు. వికలాంగులకు ఇప్పటికే డబల్ బెడ్ రూమ్లలో, గృహలక్ష్మిలో ఐదు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించిందని, రానున్న కాలంలో దళిత బంధు , బీసీ బందు బీసీ బందులలో తగిన ప్రాధాన్యత కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, వారు సంక్షేమ మంత్రి ఉండడం వల్ల ఈ ప్రాంత వికలాంగులకు కూడా అధిక శాతం లబ్ధి చేకూరుతందని తెలిపారు. మంచి మనసు, ఉద్యమ నేపథ్యం కలిగిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, సమస్యల కోసం తన దగ్గరకు ఏ ఒక్కరు వచ్చిన వారిని ఇబ్బంది పరచకుండా తక్షణమే స్పందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. నియోజకవర్గ వికలాంగులు మండలాల వారీగా ప్రత్యేకంగా టీమ్ లు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలోని గ్రామాలలో ఉన్న వికలాంగులను ప్రత్యేకంగా కలిసి టిఆర్ఎస్ పార్టీ మరియు కొప్పుల ఈశ్వర్ చేసిన సహాయ కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వికలాంగులు మరింత కష్టపడి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలుపులో మన వికలాంగుల భాగస్వామ్యం ఉండాలని కోరారు.
ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, FRO కొండయ్య, RPD Act 2016 Advoisary board committee Member బండి సత్యం, ధర్మపురి అధ్యక్షుడు విఠల్ గౌడ్, గొల్లపెల్లి అధ్యక్షుడు రాజయ్య, పెగడపల్లి అధ్యక్షుడు శ్రీధర్,ధర్మారం అధ్యక్షుడు గంగయ్య , ఎండపల్లి అధ్యక్షుడు నాగేందర్, వెల్గటూర్ అధ్యక్షుడు నరేష్, బగ్గారం అధ్యక్షులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.