రైతులు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి
వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 14 (జనంసాక్షి): రైతులు వ్యవసాయానికి సంబంధించిన సాంకేతికతను అవగాహన చేసుకుని నూతన పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కే మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ మండలం మారుపాక గ్రామంలో కిసాన్ సారధి డిజిటల్ e ప్లాట్ ఫామ్ గురించి గురువారం రైతులకు అవగాహన కల్పించారు. పంటలలో వచ్చే చీడలు వాటి నివారణకు సంబంధించిన పూర్తి సమాచారం రైతులకు కావలసిన భాషలో దీని ద్వారా పొందవచ్చన్నారు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్ 14426 లేదా 1800 123 2175 ద్వారా సంప్రదిస్తే తమ జిల్లా పరిధిలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు అందుకు అనువైన మార్గాలను సూచించడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి రాజు రావెప్ విద్యార్థినిలు, రైతులు పాల్గొన్నారు.