నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి
జనం సాక్షి/ కొల్చారం
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. గురువారం కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన మిద్దె భానుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును ఆయన అందజేశారు. వైద్యం కోసం నిరుపేద ప్రజలు అప్పుల బారిన పడకుండా ఉండడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా l ఆర్థిక సహాయం అందజేస్తూ నిరుపేదలకు ఆర్థికంగా ఆసరా అందిస్తున్నది అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు రవితేజ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు ఆదాం ఆత్మ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, సోషల్ మీడియా కన్వీనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు