గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థుల ఆనందోత్సాహాలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15 (జనం సాక్షి)వరంగల్ ఎన్ఐటి(నిట్ )లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు శుక్రవారం తమ ఆనందోత్సాహాలను పంచుకున్నారు.
ఈనెల 16 న శనివారం ఎన్ఐటిలో 21వ కాన్వకేషన్ సందర్భంగా వారు ఎన్ఐటిలో తమ సంతోషాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగంలో తరుణ్ మారేడ్ల, మెకానికల్ ఇంజనీరింగ్ లో రేవంత్, కమ్యూనికేషన్ సైన్స్ విభాగంలో దినేష్ రెడ్డి తోపాటు బయోటెక్నాలజీ విభాగంలో నివేదిత నలుగురు గోల్డ్ మెడల్స్ సాధించారు. దీంతో నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి పాటు ప్రొఫెసర్లు వివిధ విభాగాల డీన్లు ఈ నలుగురు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు గోల్డ్ మెడల్స్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ జీవితంలో ఇది మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని తెలిపారు. తాము ఎంతో కష్టపడి చదివామని తమను అందరూ ప్రోత్సహించారని గుర్తు చేశారు. వారందరికీ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.