సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లోకి చేరికలుజనంసాక్షి, మంథని : మంథని నియోజక వర్గం పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావ్ మండలం చిన్న తుండ్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు శుక్రవారం మంథని పట్టణం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. వీరికి సునీల్ రెడ్డి కాషాయ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై సునీల్ రెడ్డి తో కలిసి పని చేయాలని, మంథనిలో మార్పు రావాలని దృఢ సంకల్పంతో పార్టీలో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, ఓబీసీ మోర్చా మల్హర్ మండల అధ్యక్షులు గంగాధరి సమ్మయ్య, సీనియర్ నాయకులు రేపాక శంకర్, కోరబోయిన మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.