ప్రశాంతంగా వినాయక చవితి వేడుకలు…

రాజంపేట్ సెప్టెంబర్ 17 జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఆదివారం మండలంలోని మత పెద్దలు, వివిధ గ్రామాల వినాయక కమిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎస్సై సంపత్, అధ్యక్షత వహించి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు.వనాయక మండపాలు, ఊరేగింపుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వినాయక కమిటీ ప్రతినిధులకు ఎస్సై తెలిపారు. పండుగ సందర్భంగా లౌడ్‌స్పీకర్లు, బాణసంచా కాల్చడం, ప్లాస్టిక్‌ వస్తువులు వాడకుండా చూడాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు స్థానిక పరిపాలనకు సహకరించాలని కోరారు. ఉత్సవాలకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేసి నిమజ్జనోత్సవాన్నిసజావుగానిర్వహించాలన్నారు.పోలీసులు తీసుకున్న చొరవను మత పెద్దలు, వినాయక కమిటీ ప్రతినిధులు అభినందించి శాంతియుతంగా నిర్వహించే వినాయక చవితి వేడుకలకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మార్గనిర్దేశం చేసి సహకరించిన ఎస్సై సంపత్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ అనుచరుల మధ్య మత సామరస్యం, సౌభ్రాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేస్తామని, ఇతర మతాల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వినాయక కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.