రాబోయే తరాలకు శాపంగా మారిన పిల్లల క్యాన్సర్ -మల్లాపూర్ లయన్స్ క్లబ్

-చిన్నపిల్లల క్యాన్సర్ అవగాహన కరపత్రం ఆవిష్కరిస్తున్న ప్రాథమిక వైద్యాధికారి వాహిని, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సంజీవ్..

మల్లాపూర్ సెప్టెంబర్ 22( జనం సాక్షి)

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మంది పిల్లలకు క్యాన్సర్ గురికావడం జరుగుతుంది. బాలల క్యాన్సర్ గుర్తించడం పట్ల అవగాహన సదస్సు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్లాపుర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనుక సంజీవ్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల క్యాన్సర్ అవగాహన, వ్యాధి లక్షణాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక వైద్యాధికారి వాహిని మాట్లాడుతూ రాబోవు తరాలకు శాపంగా మారిన ఈ చిన్న పిల్లల క్యాన్సర్ భూతం ముందు తరాలకు పాకకుండా ఉండాలంటే, వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా గర్భవతులు మంచి ఆహారం తీసుకోవడం వలన అరికట్టవచ్చు. ఈ క్యాన్సర్ వ్యాధి ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం, వాతావరణంలో జరిగే మార్పు వల్ల కూడా క్యాన్సర్ రావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా రీజినల్ సెక్రటరీ రు