అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
* సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత ఆవునూరి మధు

టేకులపల్లి, సెప్టెంబర్ 22( జనం సాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లు,హెల్పర్ల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ టేకులపల్లి మండలంలో నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు,ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగా (ఐ ఎఫ్ టి యు) జిల్లా ప్రధాన కార్యదర్శి కే సారంగపాణిలు శుక్రవారం సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ ఈ రాష్ట్రంలో 70 వేల మంది అంగన్వాడి టీచర్లు,హెల్పర్లు పనిచేస్తున్నారని వారి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని నిరవధికంగా చేపట్టిన సమ్మెను ప్రభుత్వం పట్టించుకోని వారి న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సమ్మె చేయని డిపార్ట్మెంటే లేదని,వారి సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. అంగన్వాడి టీచర్లకు ఉద్యోగ భద్రతతో పాటు పిఎఫ్,ఈఎస్ఐ,రిటైర్మెంట్ అయ్యాక పది లక్షలు ఇవ్వాలని, ఉద్యోగం చేస్తూ చనిపోయిన కుటుంబాల ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీలతో వెట్టి చాకిరి చేపించుకుంటూ శ్రమదోపిడి చేస్తూ వారి వేతనాలు అడిగితే పెంచకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తక్షణమే వారిని ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, నాయకులు గుగులోతు రామచంద్రు,అరుణోదయ జిల్లా క�