ముగ్గుల పోటీ విజేతలకు ఉత్తమ బహుమతులు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 22 (జనం సాక్షి)

గురువారం రోజు రాత్రి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్వీన్ రోడ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర గల గజానన ఫైనాన్స్ కార్పొరేషన్ వారిచే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది ఇందులో దాదాపు 30 మంది బాలికలు. వృద్ధ మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేయడం అయినది ఈ సందర్భంగా ఉత్తమమైన ముగ్గులు ఎంపిక చేసి ప్రధమ బహుమతి రేణుక, ద్వితీయ బహుమతి మల్లేశ్వరి, కన్సోలేషన్ బహుమతి కుమారి కావ్య కు అందజేయడం జరిగినది అలాగే ప్రోత్సాహకరంగా పాల్గొన్న మహిళలకు అందరికీ కానుకలు అందించడమైనది. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ ఏ రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఇందులో పాల్గొన్న మహిళలకు బహుమతులు పొందిన వారిని అభినందిస్తూ వీటితోపాటు వినాయక చవితి నవరాత్రులు సందర్భంగా కళాకారులు ముఖ్యంగా బుర్రకథలు, హరికథలు, మిమిక్రీలు, పౌరాణిక నృత్యములు తదితరుములను ఏర్పాటు చేయాలని సభ్యులకు మనవి చేశారు. కళాపోషణ కలగజేయడం అనేది చాలా ముఖ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో తణుకునూరి అశోక్, అల్లాడి అప్పారావు, సూర్యం, శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులతో పాటు అత్యధికంగా మహిళలు ప్రజలు పాల్గొన్నారు.