సంక్షేమ పథకాలు ప్రజలకందించడంలో అంగన్వాడీలది కీలక పాత్ర
* పని భారం పెంచారు- వేతనాలు పెంచండి
* సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ జె రమేష్

టేకులపల్లి, సెప్టెంబర్ 22( జనం సాక్షి ): ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం, ప్రతి సర్వేను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాన పాత్ర పోషిస్తున్న అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోవడం విచారకరమని ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ విమర్శించారు. అంగన్వాడి ఉద్యోగులు నిరవదిక సమ్మె 12 వరోజు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడి కార్మికులు ఈ రాష్ట్రంలో 70,000 మంది ఉన్నారని టీచర్స్ మినీ టీచర్స్, హెల్పర్స్ సెప్టెంబర్ 11 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. తమని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, పర్మినెంట్ చేయాలని,కనీసం వేతనం 26 వేలు ఇవ్వాలని, మినీ టీచర్స్ నీ మెయిన్ టీచర్స్ గా గుర్తించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్ కి 10 లక్షలు ఇవ్వాలని, హెల్పర్స్ కు
5 లక్షలు ఇవ్వాలని,ఈపీఎఫ్, ఇఎస్ఐ ప్రమాదం భీమా సౌకర్యాలు కల్పించాలనే తదితర డిమాండ్లు సాధనకు సమ్మె చేస్తున్న అంగన్వాడి టీచర్స్ న్యాయమైన సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు పేదలకు అందించడంలో సర్వేలు నిర్వహించటంలో, ముఖ్యంగా బీల్వో లు గా విధులను నిర్వహించడంలో అంగన్వాడీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.పని భారం పెరిగిందని, రకరకాల యాప్ లు తీసుకువచ్చి అంగన్వాడీ సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారన్నారు. వారి శ్రమ దోపిడీకి బదులుగా వారు చేపడుతున్న న్యాయమైన వేతనాన్ని పెంచుతూ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఎంతో న్యాయమైనదిగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వర్కర్ గా ఉన్న వారిని పేరుని టీచర్ �