ఉత్తమ పంచాయతీల స్ఫూర్తితో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు అన్ని విధాల అభివృద్ధి చెందాలి – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్22( జనంసాక్షి )నాగర్ కర్నూల్జిల్లాలోప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల రూపురేఖలు మారతాయని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.’స్వచ్ఛ సర్వేక్షణ్
గ్రామీణ్-2023’లో ఎంపికైన 15ఉత్తమపంచాయతీలసర్పంచులు,ఎంపీడీఓలు,ఎంపీఓలు,
పంచాయతీ కార్యదర్శులకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 ఉత్తమ గ్రామపంచాయతీ పురస్కారాలను శుక్రవారం అందజేసి సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్మానించారు. అదనపుకలెక్టర్ కుమార్ దీపక్మాట్లాడుతూ….
ఉత్తమపంచాయతీలస్పూర్తితో మిగిలిన గ్రామాల్లో అన్ని విధాలఅభివృద్ధిచేపట్టాలన్నారు.జిల్లాలోని 461 పంచాయతీల్లో మూడు విభాగాల్లో పురస్కారాలకు గ్రామాల్ని ఎంపిక చేశారని చెప్పారు. 2 వేల లోపు, 2 నుంచి 5 వేలు, 5 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో పారిశుద్ధ్యం, ఘన, ద్రవ వ్యర్థాల సేకరణ, ఓడీఎఫ్ ప్లస్ విభాగాల్లో సాధించిన ప్రగతి ఆధారంగా పురస్కారాలు అందజేసినట్లు అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ వివరించారు.జిల్లాలో 15 గ్రామ పంచాయతీలు అవార్డులు సాధించడం సంతోషంగా ఉందని, అందుకు కృషి చేసిన సర్పంచులు, కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామాలఅభివృద్ధిలోసర్పంచులదే కీలక పాత్ర అని అన్నారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలుపరిష్కరించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషిచేస్తోందని తెలిపారు.
అధికారులు గ్రామాల్లో పర్యటనలు చేసేటప్పుడు పచ్చదనం పరిశుభ్రత పై అధిక ప్రాధాన్యత వచ్చేలా తమ పర్యటనలో ఉండాలని సూచించారు.అనంతరం అధికారులు,ప్రజాప్రతినిధులతో కలిసిస్వచ్ఛతాసేవ’గోడపత్రికలనుఅదనపుకలెక్టర్ఆవిష్కరిచారు. 15 గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు.జిల్లాలో అవార్డు సాధించిన గ్రామ పంచాయతీలుకేటగిరీ-1లో(2వేల లోపు జనాభా కేటగిరీలో)
జీడిపల్లి( కల్వకుర్తి),నల్లవెల్లి( నాగర్కర్నూల్),అల్లాపూర్(తాడూర్),అప్పాజీపల్లితిమ్మాజిపేట), రేవల్లి (ఊరుకొండ) కేటగిరీ-2(2 వేల నుంచి 5 వేల జనాభా)అంబటిపల్లి (లింగాల), బావాజీ పల్లి (తిమ్మాజిపేట), డిండి చింతలపల్లి (వంగూర్), గౌరెడ్డి పల్లి (తెలకపల్లి), కోడుపర్తి (తిమ్మాజిపేట) కేటగిరీ-3(ఐదు వేల జనాభా కంటే ఎక్కువ)
సింగోటం (కొల్లాపూర్), నంది వడ్డేమాన్ (బిజినపల్లి), లింగాల (లింగాల), పెంట్లవెల్లి (పెంట్లవెల్లి),కొండనాగుల( బల్మూర్) గ్రామాలు జిల్లా స్థాయిలోఅవార్డులుసాధించాయి.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి నర్సింగ్ రావు, 15 గ్రామాలసర్పంచులుకార్యదర్శులుఆయామండలాలఎంపీడీవోలు ఎంపీ ఓలు తదితరులు పాల్గొన్నారు.
.