ఘనంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ధర్మపురి (జనం సాక్షి)ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక మునిసిపల్ కార్యాలయ పరిధిలో గల స్థానిక 11వ వార్డు యందు గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అపార్ట్ మేంట్ పార్కింగ్ స్థలం యందు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు 11వ వార్డు కౌన్సిలర్ జక్కు పద్మ – రవీందర్ ఆధ్వర్యంలో.. కరీంనగర్ మేడి కవర్ ఆసుపత్రి వైద్యుడు తమ్మినేని హర్షిత్ కుమార్ చౌదరి, జగిత్యాల ఏవిపీఆర్ ఆసుపత్రి నిర్వాహకుడు ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ ఎడమల శైలందర్ రెడ్డి సహాయ సహకారాలతో.. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కారణంగా ఉచిత వైద్య శిబిరంను డాక్టర్ ఎడమల శైలందర్ రెడ్డి లతో పాటు, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘన భట్ల దినేష్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.e ఉచిత వైద్య శిబిరంకు సుమారు రెండు వందల మందికి పైగా పట్టణ ప్రజలు హాజరు అవ్వగా.. వారికీ ఆసుపత్రి వైద్యులు బీపీ, ఈసీజీ, షుగర్, రక్త, దంత వైద్య పరీక్షలు నిర్వహించి, సీజనల్ వ్యాధుల పైన తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన వారికీ అవగాహన కల్పించి, తదుపరి వారికీ ఉచితంగా విలువైన మందులను పంపిణీ చేశారు. కార్యక్రమ తధానంతరం ఉచిత వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బంది డాక్టర్ తమ్మినేని హర్షిత్ కుమార్ చౌదరి, డాక్టర్ ఎడమల శైలందర్ రెడ్డి, క్యాంపు కో-ఆర్డినేటర్ తిప్పని కిరణ్ కుమార్, పిఆర్ఓ భోనగిరి మహేష్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్స్ కోటగిరి వినయ్ కుమార్, బండపల్లి రాజశేఖర్, దుర్గం కీర్తి, కంసాని అనురాధ లకు జక్కు పద్మ – రవీందర్ దంపతులు వారికీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘన భట్ల దినేష్, జక్కు దేవేందర్, పాలేపు గణేష్, ఇందారపు రామకృష్ణ, సిరికోండ అశోక్, మామిడాల రవీందర్, సర్జారావు, జైషేట్టి రాకేష్, కోరుట్ల సతీష్, సాగర్, పప్పుల శ్రీనివాస్, రంగ హరినాథ్, చౌడారపు సతీష్, ముత్యాల వెంకటేష్, లతో పాటు, పట్టణ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.