కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలు
వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): వేములవాడ గ్రామీణ మండలం బాలరాజు పల్లి, వెంకటంపల్లి గ్రామాలకు చెందిన కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భాజాపా, భారాస పార్టీలకు చెందిన దాదాపు 150 మంది కార్యకర్తలు ఈ సందర్భంగా పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామీణ మండలాధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సంఘ స్వామి, వెంకటంపల్లి, నూకలమర్రి ఎంపీటీసీలు బొడ్డు రాములు, శంకరమ్మ, ఎస్సీ సెల్ గ్రామీణ అధ్యక్షుడు రాజు, బండ శ్రీనివాస్, వంగ మల్లేశం, ఎల్లా గౌడ్, జగదీశ్వర్, భాస్కర్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.