పరిగి నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం
ఇంకా ఎంతకాలం బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తారు
ఓట్లు మావి సీట్లు మీకా
పరిగి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కుమ్మరిపల్లి లాలయ్య ముదిరాజ్

వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 22( జనం సాక్షి)

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో అధిక శాతం మరుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారని ఇంకా ఎంతకాలం ఈ ప్రాంతంలో అగ్రవర్ణాలే పాలిస్తారా ఓట్లు మావి సీట్లు మీవా పరిగి నియోజకవర్గం నుంచి త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నేనుంటానని ముదిరాజుల ముద్దుబిడ్డ లాలయ్య ముదిరాజ్ ప్రశ్నించారు 2018 ఎమ్మెల్యే నామినేషన్ లో మన పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేయడానికి వెళ్లినానని కొద్ది క్షణాల్లో సమయం ఆలస్యమైనందున కొద్ది క్షణాల్లో నామినేషన్ దాఖలు చేయలేకపోయానని లాలయ్య ముదిరాజ్ వాపోయారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం పోటీలో నేను ఉన్నాననిఆయన అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వికారాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తినని వివరించారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసుకుని ముందడుగు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పల్లె పల్లెకు ప్రజల మధ్యకు అనే కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులు సాధించడానికి అందరిని కలుపుకొని భవిష్యత్తులో ప్రజా ఎజెండాతో ఎన్నికలకు వెళ్తానని అన్ని వర్గాల మద్దతుతో విజయం సాధిస్తానని ఆశా భావం వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గ ప్రజల మద్దతుతో ఆశీస్సులతో బరిలో ఉంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఉచిత విద్య వైద్యంను అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ఆయన వివరించారు. వెనుకబడిన కులాలకు వెనుకబడిన జాతులకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందించినప్పుడే వారి జీవనశైలి విధానం బాగుంటుందని ఆయన అన్నారు. ముందు తరాలు కూడా అభివృద్ధిలో బాగుంటాయని ఆయన వివరించారు. పరిగి నియోజకవర్గగాని నేను ఎన్నుకోవడానికి కారణం ఆధిపత్య కులాల పెత్తనం జరుగుతుందని ఈసారి జరగబోయే ఎన్నికలలో పరిగి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మొదటి నామినేషన్ నాదే వేయడం జరుగుతుందని పరిగి ఎమ్మెల్యే స్వాతంత్ర అభ్యర్థి లాలయ్య ముదిరాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మీరు పరిగి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మద్దతు తెలిపిన ప్రజలు ఆయన అనుచరులు తదితరులు పాల్గొన్నారు