కుప్పానగర్ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న : ఎస్సై

– శాంతితో అతను గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
– తల్లిదండ్రులను గౌరవించాలి

జహీరాబాద్ సెప్టెంబర్ 22 (జనం సాక్షి) : ఝరాసంగం మండల కుప్పానగర్ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద అంబేద్కర్ సేన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఝరాసంగం ఎస్సై రాజేందర్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాన్ని దర్శించి ఎస్సై మాట్లాడుతూ… గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. యువత భక్తి మార్గంలో నడిచి దైవంతో పాటు తల్లిదండ్రులను కూడా గౌరవించాలని సూచించారు. నిమజ్జన సమయంలో నిర్వాహకులు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల్లో డీజేలకు పర్మిషన్ లేదని ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, మాజీ ఎంపిటిసి దశరథ్, గ్రామ పెద్దలు దౌవులన్న, లాలు, నర్సింలు, మానేన్న, నర్సింలు, అంబేద్కర్ సేన ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.