వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, 45వ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు.శుక్రవారం
విద్యానగర్ లో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇంటి వద్ద నెలకొల్పిన బంకమట్టి వినాయక విగ్రహం వద్ద జరిగిన కుంకుమ పూజలలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి
గండూరి పావని కృపాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని మహిళలకు చీరలు, పసుపు కుంకుమలను వాయినంగా ఇచ్చారు.అనంతరం కామ్లేకర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేసిన మట్టివిగ్రహాలను విద్యానగర్ లో పలుచోట్ల నెలకొల్పినట్లు చెప్పారు.పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్, వాంకుడోతు వెంకన్న, కలకోట లక్ష్మయ్య, గుండా శ్రీధర్, వుల్లి రామాచారి, యాదా కిరణ్, పోతుగంటి మల్లికార్జున్, తెరటపల్లి సతీష్, మంచాల శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, వంగవీటి రమేష్, మిర్యాల శివకుమార్, కామ్లేకర్ హరిప్రసాద్, కామ్లేకర్ శ్రీకాంత్, కామ్లేకర్ భారతి, ఈటూరి లక్ష్మిదుర్గ, పోతుగంటి సునీత, మంచుకంటి కవిత, మేడిగ ఉమ,చంద్ర, ఎలగందుల‌ స్వరూప, బిక్కుమళ్ల సునీత, కూరెళ్ల ఝాన్సీ , కక్కిరేణి శిరీష, నల్లపాటి అనురాధ తదితరులు పాల్గొన్నారు.