మండల వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాల సామాజిక తనిఖీ నిర్వహించారు.

డి ఆర్ డి ఓ .విరోజా

జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక. మండల వ్యాప్తంగా సంవత్సర కాలంగా వివిధ గ్రామాలలో నిర్వహించిన అభివృద్ధి పథకాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన అధికారులు నేడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రజా వేదిక నిర్వహించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు కూలీల వివరాలను సభకు సమర్పించారు. అడిషనల్ డి ఆర్ డి ఓ విరోజా మాట్లాడుతూ గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగాయని అక్కడక్కడ చిన్నచిన్న పొరపాటు గుర్తించినట్టు ఆమె తెలిపారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను సంరక్షించే ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కొరబోయిన మంజుల కాశీనాథ్, ఎంపీడీవో గంగుల గణేష్ రెడ్డి, క్యూ సి రమాకాంత్ సంపత్, డీఈఓ శ్రీహరి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలు పాల్గొన్నారు.