వనపర్తి జిల్లాకు త్వరలో ఐటి టవర్

రూ.10 కోట్లతో అద్భుతమైన ఐటీ టవర్

వనపర్తికి అభివృద్ధి పనులకు దాదాపు రూ.200 కోట్లు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి:

వనపర్తి బ్యూరో సెప్టెంబర్22 జనం సాక్షి

వనపర్తి జిల్లాలో త్వరలో ఐటీ హబ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని దానికి సంబంధించిన జీవోను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.ఈ మధ్యకాలంలోనే బ్రిడ్జ్ లు, రహదారులు, భవనాలకు నిధులు మంజూరయ్యాయి.కందకం, డబల్ బెడ్రూం ఇండ్లు, ఓల్డ్ హాస్టళ్ల పునరుద్దరణ తదితర వనపర్తి పట్టణాభివృద్ది కోసం రూ.50 కోట్లు ,పెబ్బేరు పట్టణాభివృద్ది కోసం రూ.5 కోట్లు,పెబ్బేరు సంత అభివృద్ధి కోసం ఈ నిధులు వినియోగిస్తాం అన్నారు.టఫ్ ఐడీసీ కింద నిధులు మంజూరు చేశారు.అన్ని రహదారుల మీద భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామన్నారు.జెర్రిపోతుల వాగు, రామాటాకీస్, గోపాల్ పేట, కంచిరావులపల్లి చాపల వాగు వద్ద బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తయ్యాయి.వనపర్తిని జిల్లాను చేయడంతో పాటు మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని ఇక్కడ నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృషిచేస్తున్నామన్నారు. అదేవిదంగా త్వరలోనే అక్రిడేషన్, నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
దశలవారీగా అందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేదలైన జర్నలిస్ట్ లకు గృహలక్ష్మి, డబల్ బెడ్రూం ఇండ్లు, ఇంటి స్థలాలు,వనపర్తి జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
వనపర్తి పెబ్బేరు పట్టణాలకు అభివృద్ధి పనులకు సంబంధించి రూపాయలు 55 కోట్లు మంజూరు చేసిన ఐటీ పరిశ్రమలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 29న కేటీఆర్ రాక సందర్భంగా సభ విజయవంతానికి, వనపర్తి అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు.ప్రజలు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేశారు.ప్రజలిచ్చిన అవకాశంతో వనపర్తి అభివృద్ధికి కృషిచేశాను .. కేవలం ఐదేళ్లకాలంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి చేశమన్నరు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు వైస్ చైర్మన్ కర్రె స్వామి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.