వినాయకుని లడ్డు కైవసం చేసుకున్న చేనేత ప్రముఖ వ్యాపారస్తుడు ఒగ్గు వెంకటేష్.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 22 జనం సాక్షి.

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సేవా సంఘం,పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపంలో గణనాథుని లడ్డు వేలం పాట జరిగింది. పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు నామాల శ్రీకాంత్ .పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అక్కల రఘు ఆధ్వర్యంలో వారి కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు శుక్రవారం ఐదవ రోజు కాబట్టి వినాయకుని లడ్డు వేలం పాట, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ లడ్డు వేలం పాట హోరాహోరీగా జరిగింది 1, 29,999 వరకు వేలంపాట పాడి ఒగ్గు వెంకటేష్ చేనేత కార్మికుడు గద్వాల చేనేత చీరల ప్రముఖ వ్యాపారస్తుడు కైవసం చేసుకున్నాడు. వినాయకుని లడ్డు వేలంపాటలో కైవసం చేసుకున్నందుకు గద్వాల పట్టణ పద్మశాలీలు కుల బాంధవులు అందరూ ఒగ్గు వెంకటేష్ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాకం బీచ్పల్లి, 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమన్నారాయణ, సంఘ మహావీర్, పుట్ట జయప్రకాష దూడం శ్రీనివాసులు, మంత్రి సురేష్, ఏర్వ రామస్వామి, అక్కల శ్రీనివాసులు, చిలువేరి సాయిబాబా,గడ్డం రఘు, మహంకాళి కరుణాకర్, పగడాకుల నారాయణ, మహంకాళి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.