14 యూనిన్లకు సమాన ప్రోటోకాల్!—————————————-27 కు డిప్యూటీ సీఎల్సీ వద్ద చర్చలు వాయిదా!———————————–

సింగరేణి లోని 14 రిజిస్టర్డ్ యూనియన్లకు ఇక మీదట సంస్థలో సమాన ప్రోటోకాల్ పాటిస్తారు. ఏరియా, పిట్, మొత్తం కార్పొరేట్ స్థాయిలో యూనియన్ ఎన్నికలు సంస్థలో నిర్వహించే దాకా చర్చలు జరిపీనా, ఏదైనా అధికారిక కార్యక్రమం నిర్వహించినా అన్ని కార్యక్రమం లకు 14 యూనియన్ ల ప్రతినిధులను పిలుస్తారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అధికారిక లేఖ కూడా జారీ చేసింది. ఇది ఇలా ఉండగా శుక్రవారం యూనియన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉండగా డిప్యూటీ సిఎల్సి కార్యాలయంలో యూనియన్ ప్రతినిధుల, అధికారుల సమావేశాన్ని ఈనెల 27 కు డీప్యూటీ సిఎల్సి శ్రీనివాసులు వాయిదా వేశారు. కోర్టులో కంపెనీ ఎన్నికలు వాయిదాకు వేసిన పీటీషన్ మీద తీర్పు ను కోర్ట్ రిజర్వు చేసింది. తీర్పు ఈ నెల 27 లోపు వచ్చి అందులో ఎన్నికలు వాయిదాకు ఆదేశం వస్తే, ఎన్నికలు వాయిదా పడుతాయి, ఒకవేళ కోర్ట్ ఎన్నికలు జరపాలని ఆదేశం ఇస్తే,27 న షెడ్యూల్ విడుదల చేస్తారు.15 యూనియన్లకు గాను 14 యూనియన్లు ఇప్పుడు జాతీయ యూనియన్లు, టీబిజీకెఎస్ తదితరులది అందరిదీ సమాన హోదానే కావడం తో అందరికి సమాన ప్రోటోకాల్ లభించే ఆదేశం సింగరేణి యాజమాన్యం ఇవ్వడం తో ఇక ఎన్నికలు సంస్థలో 2024 వరకు కూడా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికలు జరుపకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో పని చేయడం దురదృష్టకరం అని, స్టేట్ చేతిలో సింగరేణి రిమోట్ పెట్టు కున్నది అని, సింగరేణి ఒక ఉత్సవ విగ్రహం లా పని చేస్తుందని బిఎమ్మెఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు…………………………… ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి