ఎం ఆర్ పి ని మించకుండా రైతులకు ఎరువులు అందజేయాలి

వరంగల్ బ్యూరో సెప్టెంబర్ 22 (జనం సాక్షి)

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ నందు శుక్రవారంనాగూర్ల వెంకటేశ్వర్లు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ అధ్యక్షతన మార్నేని రవీందర్ రావు చైర్మన్ డిసిసిబి, విశిష్ట అతిథులుగా
వరంగల్ మరియు హనుమకొండ జిల్లా వ్యవసాయ శాఖ ఎరువుల హోల్సేల్ డీలర్లు మరియు ఎరువుల తయారీదారు కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశంలో రుణ విమోచన సమితి చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ కంపెనీలు ఎరువుల సరఫరా ఎస్ ఓ ఎల్ పై అందిస్తున్న ఎరువుల వివరాలు, వివిధ ఎరువుల లభ్యత గురించి సమీక్ష నిర్వహించారు.రైతులకు సకాలంలో ఎరువులను అందించాలని సూచించారు. డీలర్లకు ఎస్ ఓ ఎల్ పై మాత్రమే ఎరువులను సరఫరా చేయాలని సూచించారు. అలాగే డీలర్లు కూడా ఎమ్మార్పీని మించకుండా రైతులకు ఎరువులను అందజేయాలని తెలిపారు.
పురుగు మందుల పేరిట వివిధ భయమందులను అమ్ముతున్నటువంటి డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు కార్యక్రమంలో భాగంగా డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ డిసిసిబి బ్యాంకు ద్వారా వారు చేపట్టిన ప్రగతి వివరాలను అందించారు 80 కోట్ల టర్నోవర్ గల వారి డిసిసిబి బ్యాంకు 1700 కోట్ల టర్నోవర్ కి తీసుకు వచ్చారని తెలిపారు సకాలంలో రైతులకు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో తక్కువ వడ్డీతో లోన్లను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండేటువంటి విత్తనా పురుగు మందులు మరియు ఎరువులు డీలర్లు సకాలంలో రైతులకు కావలసిన ఎరువులను విత్తనాలను పురుగుమందులను నాణ్యమైనవి వారికి అందించాలని తెలిపారు. వారికి సరైన సూచనలు ఇవ్వాలని తెలిపారు.
కార్యక్రమంలో వరంగల్ హనుమకొండ వ్యవసాయ అధికారులు ఉషా దయాల్, రవీందర్ సింగ్ లు మాట్లాడుతూ వివిధ డీలర్ల వద్ద ఈపాస్ మెషిన్ల నందు ఎరువుల నిల్వలు క్లియర్ చేయకపోవడం వలన వారి వారి జిల్లాలకు రావలసిన ఎరువుల వాటా తగ్గుతుందని తెలుపుతూ ప్రతి ఎరువుల డీలరు ఎరువులను కేవలం ఈపాస్ ద్వారానే అమ్మకాలు జరపాలని ఎప్పటికప్పుడు ఎరువుల నిల్వలు ఈ పాస్ లో క్లియర్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ సెక్రటరీ శారదా దేవి , వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాళ్, హనంకొండ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ మరియు రెండు జిల్లాల సహాయ వ్యవసాయ సంచాలకులు దామోదర్ రెడ్డి, సురేష్ కుమార్, శ్రీనివాస్ మరియు వ్యవసాయ అధికారులు మరియు వివిధ ఎరువుల తయారుదారి కంపెనీ ప్రతినిధులు మరియు రెండు జిల్లాల హోల్సేల్ ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.