స్టీల్ బంక్ ను ప్రారంభించిన కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్ .

వనపర్తి బ్యూరో సెప్టెంబర్22( జనంసాక్షి)

వనపర్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 33 వార్డ్ వల్లబ్ నగర్ అక్షయ సప్లయర్స్ నందు పేదరిక నిర్ములన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మదర్ థెరిసా మహిళా సమైక్య సభ్యులతో స్టీల్ బంక్ ను ఏర్పాటు చేశారు. వనపర్తి మున్సిపల్ ఛైర్మెన్ గట్టు యాదవ్ వైస్ ఛైర్మెన్ వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్ ప్రారంభించారు. ప్లాస్టిక్ ను నిర్ములన చేసి పర్యావరణాన్ని కాపాడాలని వివిధ శుభాకార్యాలలో పేపర్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాసులు మాత్రమే వాడి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు కో అప్షన్ మెంబర్లు మెప్మా మున్సిపల్ కమిషనర్ విక్రమాసింహారెడ్డి సానిటరీ ఇంచార్జ్ ఉమామహేశ్వర్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు