ప్రభుత్వ పథకాల పంపిణీ తీరుతో

అధికార పార్టీ గ్రాఫ్ డౌన్?

• పథకాల అమల్లో అధికారుల పాత్ర శూన్యం

• ఎమ్మెల్యే అనుచరులదే హవా..

వారి కుటుంబ సభ్యులకు బంధువులకే పథకాలు

అందం.. అందని వారిలో ఆగ్రహం

సొంత పార్టీలోనూ అసంతృప్తి జ్వాలలు..

ప్రజల్లోనూ పెరుగుతున్న వ్యతిరేకత

పడిపోతున్న ఎమ్మెల్యే గ్రాఫ్

కొల్చారం (జనం సాక్షి): ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలను అధికార యంత్రాంగం ద్వారా అమలు చేస్తూ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు అందించేలా చూస్తుంది. తద్వారా పథకాల అమలు తీరు పారదర్శకత్వ గా ఉండి జవాబుదారితనంగా ఉంటుంది. ప్రజలు కూడా అందిన అందకపోయినా కొంతవరకు సర్దుకుపోతారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం వాటి ద్వారా ఓట్లు రాబట్టుకోవడం అధికారంలోకి రావాలని కలలు కనడం ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు సర్వసాధారణమని అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు ప్రక్రియలో అధికార యంత్రాంగం పాత్ర శూన్యం అనేది బహిరంగ రహస్యమే. నియోజకవర్గంలో ఏ పథకమైన స్థానిక ఎమ్మెల్యే కనుసనల్లోనే ఆయన చెప్పిందే వేదంగా అమలు జరుగుతుంది. ఇదే అదునుగా అధికార పార్టీ మండల స్థాయి నేతలు చోటామోటా నాయకులు పలువురు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎలాంటి పథకాలు అయినా మొదట తమ కుటుంబ సభ్యులకు బంధువులకు లబ్ది

చేకూరే విధంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేను సైతం తప్పుదారి పట్టిస్తూ గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యేకు వ్యతిరేక జ్వాలలు పుట్టిస్తున్నారనే చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ పథకాల అమల్లో మండల స్థాయి అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమైనారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టి ప్రజల్లో . సొంత పార్టీ శ్రేణుల్లోను కూడా తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. ఎమ్మెల్యే టికెట్ ఖరారు కావడంతో ఎమ్మెల్యే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ ప్రజాక్షేత్రంలోనికి వెళ్తున్నారు. దాదాపు ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తూ దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు గృహలక్ష్మి వంటి ప్రభుత్వ ప్రధాన పథకాలు లబ్ధిదారులకే లక్ష్యంగా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసే తీరు ఇప్పుడు వారి మెడకు చుట్టుకునే ప్రమాదం ఏర్పడిందని. గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల పంపిణీలో జరిగిన అనేక అవకతవకలు వారికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయని అందిన వారు జై కొడుతుంటే అర్హులైన అందని వారు అసలే పట్టించుకోని వారు ఎమ్మెల్యేకు నై కొడుతూ గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అందులో సొంత పార్టీ శ్రేణులే అధికంగా ఉండడం గమనర్హం. టికెట్ ఖరారు. చేసిన సరే సీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలని లేకుంటే ఒడిస్తామంటూ బీ అర్ ఎస్ మరో వర్గం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యే కు నినాదాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రజల సంక్షేమం పథకాలే ఎమ్మెల్యే వ్యతిరేక నిరస

నలకు తెరలేపే విధంగా అనుచర వర్గం తమ శ్వర్ధంగా వ్యవహరిస్తుందనే ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇట్టి విషయాన్ని ఎమ్మెల్యే గ్రహించకపోవడం ఆయన గ్రాఫ్ పడిపోతుందని చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం అమలు చేస్తున్న అరకుర పథకాల పంపిణీతో ముందుకు పోతే గోయి….. వెనకపోతే సూయిలా మారింది. సంక్షేమ పథకాలు ప్రజలో ఏ విధమైన మార్పు తెస్తాయో చూడాలి మరి