మడతకు పెరిగిపోతున్న ప్రజాభిమానం..

వినాయకుడి పూజలలో వెంకట్ గౌడ్ లీనం..

ఇల్లందు సెప్టెంబర్ 25 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విస్తృతంగా గణేష్ మండపాలను దర్శించుకుని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ పూజలు నిర్వహిస్తున్నారు.
కొలువుతీరిన మండపాలకు రూ. 5-10 వేల ఆర్థిక విరాళం అందించడం వలన ప్రజలు
సంబరపడుతున్నరు. మండపాల నిర్వాహకులు, యువత
ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ రేంజ్ తగ్గలేదు అంటూ నినాదాలు నిర్వహిస్తూన్నారు.వినాయక నవరాత్రుల సందర్భంగా ఇల్లందు మున్సిపాలిటీలో కొలువుదిరిన గణేష్ మండపాల వద్దకు వెళ్లి మండప నిర్వాహకులను పలకరిస్తూ గతంలో లాగానే ప్రతి మండపానికి రూ.5-10 వేల వరకు ఆర్థికంగా విరాళం అందజేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా పట్టణ శివారు నుండి పట్టణంలో ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యువత తమ అభిమాన నాయకుడితో సెల్ఫీలు దిగుతూ శాలువాలు కప్పుతూ తమ అభిమానం ఆనందాన్ని చాటుకుంటున్నారు. కొన్నిచోట్ల మహిళలు పూలతో స్వాగతాలు పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. మండపాల్లో కొలువుదీరిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఆయన క్రేజ్ ఏంతలా ఉందంటే దూరం నుండి కారు బండి నెంబర్ 6666 చూడగానే వెంకటన్న వచ్చారు… అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వస్తున్నారు. ప్రతి వినాయకుడి మండపాల వద్ద యువత, మహిళలు గుమ్మి కొడుతూ బ్యాండ్ మెలాలతో, కోలాటాలతో, బాణ సంచాలతో,ఘన స్వాగతం పలుకుతున్నారు. కాగా గణేష్ నవరాత్రులు, దసరా ఉత్సవాలకు మారుపేరు మడత వెంకట్ గౌడ్ అని చెప్పుకోవాలి. ఎంతమంది నాయకులు వచ్చిన ఆయనలా కార్యక్రమాన్ని నిర్వహించలేరు.. ప్రజల మనసులను గెలవాలేరన్న విషయాన్ని పట్టణ ప్రజలు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నారు. ఇల్లందు పేరు ఇతర జిల్లాలకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలకు పెట్టింది పేరుగా మారు మోగించారంటే కేవలం అది వెంకట్ గౌడ్ హయంలోనే నన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో వెంకట్ గౌడ్ చరిష్మా కచ్చితంగా ఉండబోతుందని, తామంతా తమ అభిమాన నాయకుడు వెంట నడుస్తామని పట్టణంలోని వార్డుల యువత, మహిళలు స్పష్టంగా తెలియజేస్తున్నారు.