పత్తి పంటను పరిశీలించిన..

శంకరంపేట్ ఏడిఏ రాంప్రసాద్

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 25 టేక్మాల్ మండల పరిధిలోని తంపులూర్ గ్రామంలో పత్తి పంటలను పరిశీలించిన శంకరంపేట్ (అ ) ఏడీఏ రాంప్రసాద్. పత్తి పంటను పరిశీలించి పంట వడలి పోతే లీటర్ నీటికి 3 గ్రా చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క అడుగు భాగం తడిసే విదంగా 5-7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలన్నారు. పంట త్వరగా కోలుకోవడానికి లీటర్ నీటికి 10 గ్రా ల మల్టి కె లేదా 19-19-19 ల వంటి పోషకాలను పిచికారీ చేసుకోవాలని మరియు తెల్లదోమ ఉదృతి తీవ్రంగా ఉంటే ఎసిపేట్ మందును 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి, తెగులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పూత రాలిపోకుండ ప్లానోపిక్స్ 44 మి. లీటర్ ఎకరాకు పిచికారి చేసుకోవాలి అని రైతులకు తెలియ జేశారు.