పరకాలలో గెలుపే బిజెపి లక్ష్యం…..ఒక్కసారి బిజెపికి ఛాన్స్ ఇవ్వండి.

సంగెం మండలనికి పట్టిన గ్రహనం ఎమ్మెల్యే షాడో.

సమైక్యవాది షాడోను తరమడమే బిజెపి లక్ష్యం.

సంక్షేమ పథకాల కోసం ప్రత్యేక పైరవీలు చేస్తున్న వెంకటేశ్వర్లు ,హరికృష్ణ.

మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి. బిజెపి నాయకుడు డాక్టర్ కాళీ ప్రసాద్.

సంగెం ప్రతినిధి: సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
సంగెం మండలానికి పట్టిన గ్రహణం సమైక్యవాది అయిన ఎమ్మెల్యే షాడో అని అన్నారు.మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు సంగెం మండలం గవిచర్ల గ్రామంలో మండలం అధ్యక్షుడు బుట్టి కుమార స్వామి ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి బిజెపి కార్యక్రమం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, బిజెపి నాయకులు డాక్టర్ కాళీ ప్రసాద్.

గ్రామంలో స్థానిక బిజెపి నాయకులతో మాజీ ఎమ్మెల్యే మొలుగురు బిక్షపతి, బిజెపి నాయకులు డాక్టర్ కాళి ప్రసాద్ కలిసి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. తదనంతరం మండల అధ్యక్షుడు బుట్టి కుమార స్వామి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించగా ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, బిజెపి నాయకులు డాక్టర్ కాళి ప్రసాద్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ… సంగెం మండలానికి ఏ పని కావాలన్నా, ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా ఎమ్మెల్యే షాడోకే చెప్పాలని షాడో చెప్పిందే వేదంగా ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన , నిజాం నిరంకుశ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రభుత్వానికి స్వతంత్రం వచ్చిన ఇంకా సంగేం మండలానికి స్వతంత్రం రాలేదని, మండలం ఇప్పటికి సమైక్యవాది అయిన నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కబంధహస్తాల కింద ఉందని, నిమ్మగడ్డ ఏది చెప్తే అది చేయాల్సిందని లేకుంటే వారిని రాజకీయంగా ఎదకుండా తొక్కేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య పాలన నుండి తెలంగాణకు స్వతంత్రం సిద్ధిస్తే మండలంలో మాత్రం ఈ సమైక్యవాది పెత్తనం ఎక్కువవుతుందని ఈయన ఎమ్మెల్యేకి ఎంత చెప్తే అంతే అని నానుడి ఉందని అన్నారు. ఈయన చేసే అరాచకాలు అంతా ఇంత కాదని ప్రభుత్వ ఉద్యోగాలను కూడా మార్చాలన్న ఈయన చెప్పిందే ఎమ్మెల్యే చేస్తాడని, ఎమ్మెల్యేకు తెలియకుండా ఎన్నో పైరవీలు చేసి ప్రభుత్వ అధికారులు మార్చిన వ్యక్తిగా ప్రజలందరికి తెలుసని అన్నారు. ఇప్పటికీ దళిత బంధు, గృహలక్ష్మి ,బీసీ బంధు లాంటి సంక్షేమ పథకాలను సామాన్య ప్రజలకు రాకుండా అడ్డుకుంటూ ఆధిపత్యం చేస్తున్నాడని, ఈయనతో జతకుడి ఎమ్మెల్యే దగ్గర ఉండే హరికృష్ణ కూడా ప్రజలకు అన్యాయం చేస్తూ పెత్తనాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఈ షాడో అనుచరులతో ప్రజలను మోసం చేస్తున్నాడా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో సమైక్య వాది అయిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తరిమికొట్టాలని అలా తరిమి కొడితేనే ఆయనతో ఉండే సమైక్య వాదులందరూ నియోజకవర్గాన్ని వదిలి వెళ్తారని అన్నారు. సంగెం మండలంలో అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధించేది బిజెపి పార్టీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు గూడ ఉమేందర్, నరసింహ చారి, బండ్లోజు ,బుట్టి కుమార స్వామి, బెజ్జంకి శేషాద్రి, తక్కలపల్లి వెంకటేశ్వర్లు, ఎండి రహమతుల్లా, బీజేవైఎం అధ్యక్షులు అవనిగంటి సతీష్, జక్క చేరాలు, రంగరాజు కృష్ణ, దమెరుప్పుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.