పశుసంవర్ధక శాఖ పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డిని కలిసిన వికారాబాద్ జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
పశుసంవర్ధక శాఖలో 18 సంవత్సరాలుగా సేవ చేస్తున్న మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మా స్థానాలలో వీఆర్ఏలను నియమించడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర కనులు భూగర్భ వనరులు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి ని కలిసి సోమవారం వారి గోడు వినిపించారు వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 38 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా 547 మంది పశుసంవర్ధక శాఖలో వైద్యులకు సహాయకులుగా సేవలందిస్తున్నామని మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మా స్థానాలలో వీఆర్ఏలను భర్తీ చేయడం జరుగుతుందని వారు మంత్రిని మొరపెట్టుకున్నారు ఉద్యోగుల సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి మహేందర్ రెడ్డి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామచంద్రయ్య మాట్లాడి పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు మంత్రి హామీతో ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కొండాపూర్ కలాన్ సర్పంచ్ పరమేశ్వర్ వికారాబాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాబురావు రవి రఘు ఇక్బాల్ వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు