టిఎస్ పిఎస్సి రద్దు చేయాలి —- బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.గుణ………………

సోమవారం బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ ప్రభుత్వం టిఎస్ పిఎస్సి ని రద్దు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఎం.వెంకటేష్ గుణ మాట్లాడుతూ అక్రమాలకు, అవినీతికి పాల్పడిన టి.ఎస్.పి.ఎస్.సి. ని రద్దు చేయాలని, గౌరవ తెలంగాణ హైకోర్టు గ్రూప్ – 1 పరీక్ష ను రద్దు చేయడం బిఎస్పీ పార్టీ విజయమే అని, అలాగే ఈ ప్రభుత్వం కేవలం ఐదు వేల టీచర్ ఉద్యోగాలే ప్రకటించింది వాటిని 13000 వేలకు పెంచాలని, ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉండే పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని, గ్రూప్ – 1 పరీక్షలో బయోమెట్రిక్ విధానం కోసం కోటిన్నర ఖర్చు చేయలేదు కానీ ప్రభుత్వ పథకాల ప్రకటనల కోసం ఒక్క రోజు కే కోటి రూపాయలు ఖర్చు చేయడం సిగ్గు చేటని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి జాగిరి రాజేష్, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జి మద్దెల భవానీ, బెల్లంపల్లి అధ్యక్షుడు రాజు, ఇంచార్జి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.