242వ రోజుకు చేరుకున్న జగన్‌ పాదయాత్ర

దారిపొడవునా జగన్‌కు జన నీరాజనాలు

వైకాపాలో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రేమ్‌ బాబు

విశాఖపట్నం,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రేమ్‌ బాబు వైఎస్సార్సీపీలో చేరారు. విశాఖజిల్లాలోని కైలాసపట్నంలో ఆ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసిన ప్రేమ్‌ బాబు జగన్‌సమక్షంలోనే పార్టీలో చేరారు. జగన్‌ ఆయనకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. విశాఖలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగళవారంతో 242 వ రోజుకు చేరింది. ప్రస్తుతం విశాఖ పాయకరావుపేటలో పాదయాత్ర కొనసాగుతోంది. పాయకారావు పేట నుంచి చౌడువాడ క్రాస్‌, గొట్టివాడ, పండూరు క్రాస్‌ విూదుగా రామచంద్రపురం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం దార్లపూడి జంక్షన్‌ విూదుగా దార్లపూడి వరకు జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత చేపట్టిన పాదయాత్ర 242వ రోజు మంగళవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కైలాసపట్నం శివారు నుంచి ప్రారంభమైంది. కైలాసపట్నం దగ్గర మహిళలు బారులు తీరి… వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడ నుంచి చౌడువాడ క్రాస్‌, గొట్టివాడ, పండూరు క్రాస్‌ విూదుగా రామచంద్రపురం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది. లంచ్‌ విరామం అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. దార్లపూడి జంక్షన్‌ విూదుగా దార్లపూడి వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఆయనను కలిసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పడుతున్న కష్టాలను చూసి పలువురు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. రిటైర్డ్‌ ఎస్పీ ప్రేమ్‌బాబు, టీడీపీ నాయకులు గెడ్డమూరి రమణ, మునగాడ చిరంజీవితోపాటు 200మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రజల కోసం కష్టపడుతున్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని వారు అన్నారు. కాగా, పండూరు క్రాస్‌, రామచంద్రాపురం క్రాస్‌ విూదుగా పాదయాత్ర సాగుతోంది. దార్లపూడి వరకు పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో పలువురు ఆయనపై పాటలు రూపొందించి పాడారు. పాటల

 

తాజావార్తలు