244 స్థానాల్లో ట్రంప్ జయభేరి..!!

trump-hillary-clinton-reuters-640x480-640x480హియోలో ట్రంప్‌ గెలుపు రిపబ్లికన్లలో ఆనందాన్ని నింపింది. ఒహియోలో ఎవరు గెలిస్తే వారే అధ్యక్షుడని సెంటిమెంట్ కూడా ఉండటంతో ట్రంప్ మద్ధతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం 210 స్థానాల్లో హిల్లరీ, 244 స్థానాల్లో ట్రంప్ గెలుపొందారు. విజయానికి 42 ఎలక్ట్రోల్‌ ఓట్ల దూరంలో ట్రంప్ ఉన్నట్లు తాజా సమాచారం. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలను చూసుకుంటే 21 రాష్ట్రాల్లో ట్రంప్, 16 రాష్ట్రాల్లో హిల్లరీ గెలుపొందారు. ఈ లెక్కల ప్రకారం అమెరికా అధ్యక్ష పీఠం దాదాపుగా ట్రంప్‌ను వరించినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ గెలుస్తారనే అంచనాల నేపథ్యంలో భారత్‌లోని స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ పతనమైంది. సెన్సెక్స్‌ 824 పాయింట్లు, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయింది. ఇప్పటి వరకూ టెక్సాస్‌, లూసియానా,మిసిసిపీ, అలబామా, టెన్నిసీ, కెంట్‌కీ, ఇండియానా, వెస్ట్‌ వర్జీనియా, సౌత్‌ కరోలినా, నార్త్‌ డకోటా, సౌత్‌ డకోటా,నెబ్రాస్కా, కాన్సాస్, ఒక్లహామాలో ట్రంప్‌ గెలుపొందారు. న్యూయార్క్‌, వెర్మాంట్, మసాసు, కనెట్టికట్, న్యూజెర్సీ, డెలావేర్, మేరీల్యాండ్, పెన్సిల్‌వేనియాలో హిల్లరీ గెలుపొందారు.