26 నుంచి డీఈడీ కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌, నవంబర్‌ 17 : మూడు నెలలుగా ఎదురు చూస్తున్న డీిఈడీ కౌన్సెలింగ్‌ ఎట్టకేలకు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఆగస్టులో డీిఈడీి ఫలితాలు ఆగస్టులో వెలువడినప్పటికీ కౌన్సెలింగ్‌ తేదీని ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ నాన్చుడు ధోరణి వల్ల పరీక్ష రాసిన విద్యార్థులు డిగ్రీలో చేరాలో వద్దో అనే విషయమై అయ్యోమయం నెలకొంది. ఎట్టకేలకు ప్రభుత్వం తేదీని ఖరారు చేయడంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతుంది. డిఈడి కౌన్సెలింగ్‌ తొలి విడత ఈ నెల 26వ తేదీ నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు జరగనుంది. డిసెంబర్‌ 10వ తేదీ నుంచి సీట్లను కేటాయించడం జరుగుతుంది. అనంతరం ఆదిలాబాద్‌లోని డైట్‌లో డిసెంబర్‌ 13 నుంచి 17వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. జిల్లా కేంద్రంలోని డైట్‌ శిక్షణ కేంద్రంలో 120 సీట్లు, వివిధ ప్రాంతాల్లోని డైట్‌ కళాశాలలో 150 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.