27న చలో రాజ్‌భవన్
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థి జేఏసీ ఈనెల 27న చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్ధి నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ఐకాస మద్దతు తెలిపింది. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు.