27న బాన్స్ వాడలో వీర శైవ లింగాయత్ ఫంక్షన్ హాల్ నకు భూమి పూజ
జుక్కల్, మార్చి25, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా భాన్స్ వాడ డివిజన్ కేంద్రంలో ఈనెల 27నసోమవారం ఉదయం 9.30గంటలకు
వీర శైవ లింగాయత్ ఫంక్షన్ హాల్ నకు భూమిపూజ కార్య క్రమం ఉంటుందని కామారెడ్డి జిల్లా వీర శైవ లింగాయత్ అధ్యక్షులు కె. దిగంబర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి 20లక్షల రూపాయలు మంజూరు చేశారని ఆయన తెలిపారు.
ఈ భూమిపూజ కార్యక్రమానికి సోమలింగశివా చార్య మహాస్వామిజీ (బిచ్కుంద), తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహిరాబాద్ పార్ల మెంట్ సభ్యులు బిబి పాటిల్,నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వస్తున్నారని ఆయన తెలిపారు. భూమి పూజ అనంతరం శ్రీ సరస్వతి ఫంక్షన్ హాల్ లో సభాకార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్య క్రమానికి ఉమ్మడి నిజామాాద్ జిల్లా పరిధిలోని వీరశైవ లింగాయత్, జంగమ సోదరులుఅధిక సంఖ్యలో
తరలివచ్చి కార్య క్రమాన్ని విజయవంతంచేయాలని ఆయన కోరారు.