28లోగా రాష్ట్రాన్ని ప్రకటించాలి
వరంగల్, జనవరి 20 (): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 28లోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్, మండల కార్యదర్శి కనకయ్య డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జరిగిన ర్యాలీ, ధర్నాలో భూపాలపల్లి నుంచి సిపిఐ, ఎఐటియుసి, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు రమేశ్, సుధాకర్‌రెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.