28,29 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీ రానున్నారు. ఆయన 28న సీపీఐ అనుబంధ రైతు సంఘం జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించే ధర్నాలో  పాల్గొంటారు. ఆ మరుసటి రోజు రాష్ట్రపతిని కలిసే అవకాశముంది వామపక్ష,తృతీయ కూటమి నేతలతో భేటీ అయ్యే అవకాశముంది.