3 కిలోల గంజాయి పట్టివేత

చెన్నారావుపేట,జనవరి13( జనం సాక్షి ):
ఒకరి అరెస్ట్..
నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి…
3 కిలోల గంజాయిని అక్రమంగా తీసుకువస్తుండగా పట్టుకొని ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మండలంలోని అక్కల్ చెడ గ్రామానికి చెందిన పడిదం ప్రదీప్ అనే యువకుడు చత్తీస్గడ్ రాష్ట్రం నుండి 3 కిలోల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మండలంలోని పలువురికి ఎక్కువ ధరకు విక్రయించడానికి అలవాటు పడ్డాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్కల్ చెడ గ్రామ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని పడిదం ప్రదీప్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ సిఐ శ్రీనివాస్, చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



