4 నుంచి రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు
ఖమ్మం, జూన్ 12 (జనంసాక్షి): ఖమ్మం కళాపరిషత్ ఆధ్వర్యంలో జులై నాలుగు నుండి ఎని మిది వరకు పట్టణంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు అప్పారావు, రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు ఎన్టీ ఆర్ కళాపరిషత్, ఖమ్మం కళాపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రతిరోజు నాటికలు, పద్యనాటకాలు, చిన్నపిల్లల నాటికలు ప్రదర్శించనున్నామని తెలిపారు. ఖమ్మం కళాపరిషత్ ప్రతినెల నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24న భక్త రామదాసు కళాక్షేత్రంలో 19వ ప్రదర్శనగా వివిధ నాటికలు ప్రదర్శిస్తున్నట్లు వారు తెలియజేశారు.