4 నుంచి 6 వారాలు క్రికెట్‌కు దూరం కానున్న సంగక్కర
న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి) శ్రీలంక జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్వదేశంలో పటిష్టమైన భారత్‌లో జరగుతున్న వన్డే సిరిస్‌లో 2-1 తేడాతో వెనుకబడి ఉన్న లంక జట్టుకు తాజాగా కోలుకోలేని దెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ కుమార సంగక్కర చేతివేలికి గాయమైంది. దీంతో ఆయన నాలుగు నుంచి ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శనివారం మూడో వన్డే మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. మ్యాచ్ 15 వ ఓవర్‌లో కుమార సంగక్కర వ్యక్తిగత స్కోరు 24 పరుగుల మీద ఉండగా భారత బౌలర్ దిండా వేసిన బౌన్సర్ బంది బ్యాట్స్‌మెన్ చేతి వేలికి బలంగా తాకింది. ఆ దశలో పీకల్లోతు (20/3) కష్టాల్లో ఉన్న శ్రీలంక జట్టును రక్షించేందుకు బ్యాటింగ్ కొనసాగించాడు.గాయం తర్వాత మరో పరుగుల జోడించడమే కాకుండా సహచర బ్యాట్స్‌మెన్ కెప్టెన్ మహిళ జయవర్దనేతో కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని కల్పించాడు ఆ తర్వాత దిండా బౌలింగ్‌లోనే సంగక్కర్ అవుట్ అయ్యాడు. అనంతరం సంగక్కరను ఆస్పత్రికి తరలిం చిన స్కాన్ తీయగా చేతి వేలికి బలమైన గాయం తగిలినట్టు తేలింది. ఈ గాయం కారణంగా మరో నాలుగు నుంచి వారాల పాటు క్రికెట్ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలస్తొంది. ముఖ్యంగా ఆగస్టు 11 వతేది నుంచి లంక వేదికగా జరిగే ఐసీసీ వరల్ట్ ట్వంటీ- 20 ప్రపంచకు సంగక్కర అందు బాటులో లేకుండా పోచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.