వారానికి ఓసారి 40 నిమిషాలు మాత్రమే కులుసుకోవచ్చు

ఘజియాబాద్‌: ఆరుషి, హేమరాజ్‌ జంట హత్యల కేసులో శిక్ష పడి జైల్లో ఉన్న నైపుర్‌, రాజేష్‌ తల్వార్‌లకు జైలు అధికారులు నియమ నిబంధనలు తెలియజేశారు. వారిద్దరూ సమీప బ్యారక్‌లలోనే ఉంటున్నా రోజూ కలుసుకోకూడదని, వారానికి ఒకసారి 40 నిమిషాలు మాత్రమే కలుసుకోవడానికి జైలు నిబంధనలు అనుమతిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భార్యాభర్తలిద్దరూ ఖైదీలుగా ఉన్నప్పుడు వారిని ఘజియాబాద్‌ శావారులోని దాస్నాజైలులో శనివారాలు కలుసుకోనిస్తారని, జైలులో ఉన్న పార్కులో వాళ్లు కలుసుకోవచ్చని అధికారి తెలిపారు. జైలులో దంతవైద్యునిగా రాజేష్‌ తల్వార్‌ సేవలందిస్తున్నారు. నూపుర్‌ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఇద్దరికి రోజుకు చెరో 40 రూపాయలు వేతనంగా లభిస్తుంది.