400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు నేలమట్టం

చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీకోదండరామాలయం ఆవరణలో గల 400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు ఈ రోజు ఆకస్మికంగా కుప్పకూలింది. భారీ వృక్షం పడడంతో దేవాలయంలోని ధ్వజస్తంభం, ఆనాటి కల్యాణమండం కూడా నేలమట్టమయ్యాయి,  ఇది దాదాపు 400 వందల ఏళ్లుగా ఉందని అర్చకులు గోపాలాచార్యులు తెలిపారు.