42 బంతుల్లో 70 పరుగులు

మెల్‌బోర్న్‌: భారత్‌తో మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 42 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ (70) ఒంటరి పోరాటం కొనసాగిస్తుండగా.. ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ (12) చక్కటి సహకారం అందిస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.