43 మంది మిలటరీ పోలీసులు జలసమాధి

మార్గం మద్యలో బూనస్ ఎయిర్స్ ప్రాంతం దగ్గర బ్రిడ్జ్ మీద వెలుతున్న బస్సు అదుపుతప్పి ఒక్క సారిగా నదిలోకి పడిపోయింది. బస్సు డోర్ లాక్ చేసి ఉండటంతో మిలటరీ పోలీసులు లోపలి నుంచి బయటకురాలేకపోయారు. 8మంది పోలీసులు మాత్రం అద్దాలు పగలగొట్గి ప్రాణాలతో బయటపడ్డారు. 43 మంది మిలటరీ పోలీసులు జలసమాధి అయ్యారని అధికారులు తెలిపారు. మృతులకు అర్జెంటీనా అధ్యక్షుడు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు.