49 పరుగులకు ఓపెనర్ల వికెట్లు డౌన్
అడిలైడ్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారమిక్కడ జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ నిర్దేశించిన 214 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ వార్నర్(24) రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆరోన్ ఫించ్(2) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 24 పరుగులకు ఓపెనర్ల వికెట్లు నష్టపోయింది.