5వ తరగతిలో చేరికకు ఆహ్వానం

సంగారెడ్డి మున్సిపాలిటీ:2012-13 విద్యాసంవత్సరానికి బెస్ట్‌ అవెలబుల్‌ పాఠశాలలో ఐదో తరగతిలో  చేరికకు దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాజు చెప్పారు. నాలుగో తరగతి ఉత్తీర్ణులై ఉండి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.18 వేలకు ఎక్కువగా మించకూడదని తెలిపారు.ఈ నెల 8 నుండి 15వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. లాటరీ ద్వారా 18న ఎంపిక చేస్తామని తెలియజేశారు.