5లోగా అక్రిడేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి
సంగారెడ్డి, నవంబర్ 29 : 2013వ సంవత్సరం అక్రిడేషన్ కార్డుల రిన్యూవల్, కొత్తకార్డుల కోసం డిసెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా పౌరసంబంధాల అధికారి నాగార్జున ఒక ప్రకటనలో కోరారు. మెదక్ జిల్లాలో ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో గ్రాఫర్లు, న్యూస్ ఏజెన్సీ జర్నలిస్టులు దరఖాస్తుతో పాటు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల పేపర్ కటింగులు 10 తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 5లోగా దరఖాస్తులు జిల్లా పౌరసంబంధాల కార్యాలయంలో సమర్పించాలని కోరారు.