‘500వ టెస్ట్’ కేక్ కట్ చేసిన విరాట్
కాన్పూర్: న్యూజిలాండ్‌తో ఈనెల 22న మొదలయ్యే చారిత్రక టెస్ట్ కోసం టీమిండియా రాక ఆరంభమైంది. భారత జట్టు సభ్యులు విడతల వారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, మురళీ విజయ్, అజింక్యా రహానె, ఉమేష్ యాదవ్‌లు శనివారం సాయత్రం జట్టు బస చేసే హోటల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ వర్గాలు.. 500వ టెస్ట్‌ను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కోహ్లీ కట్ చేశాడు. ఆ తర్వాత బర్త్‌డే బాయ్ అశ్విన్ కూడా జట్టు సభ్యులతో కలసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. తొలుత వృద్ధిమాన్ సాహా, పుజారా, జడేజా హోటల్‌కు చేరుకున్నారు. కివీస్ టీమ్ సోమవారం రానుంది.